పాకిస్థాన్‌కు కొత్తగా ఎలాంటి మిసైల్స్ ఇవ్వడంలేదని పేర్కొంది. 2007లో 700 ఎఫ్-16 యుద్ధ విమానాల అమ్మకం సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు విడి భాగాలను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే అందజేసిన ఎఫ్-16 విమానాలకు సంబంధించిన సాంకేతిక సపోర్ట్, విడి భాగాలను మాత్రమే పంపిస్తున్నట్లు తెలిపింది.
ఈ అంశాలను తప్పుగా అర్థం చేసుకున్న పాక్ మీడియా అవాస్తవమైన సమాచారం, అంశాలతో కథనాలు ప్రచురించిందని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. గతంలోనూ పాకిస్తాన్ అనేక అంశాలపై తప్పుడు ప్రచార చేసి నవ్వులపాలైన విషయం తెల్సిందే.