ఇంటివాడు కాబోతున్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. అమ్మాయి ఎవరో తెలుసా?

గురువారం, 22 డిశెంబరు 2016 (11:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు. ఈయన వచ్చే యేడాది ఓ ఇంటివారు కాబోతున్నారు. అయితే ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆమె ఏం చదువుకుంది అనే విషయాలపై రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు కూడా ఆసక్తి చూపుతున్నారు. 
 
ఆ యువతి ఎవరో కాదు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చిన్న కుమార్తె శ్రీశ్రావ్య అని మాత్రమే అందరికీ తెలుసు. అయితే భరత నాట్యంలో ఆమె నిపుణురాలు. విశాఖపట్నంలోని గాయత్రి విద్యాపరిషత్ కాలేజీలో శ్రావ్య ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చిన్నతనం నుంచి చదువులో ఆమె ముందుండేదని, ఇంజనీరింగ్‌లో కూడా మంచి మార్కులు సాధించిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
 
బండారు ఫ్యామిలీతో కింజారపు కుటుంబానికి ముందు నుంచే సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో ఎర్రన్నాయుడితో కలిసి బండారు సత్యనారాయణమూర్తి పనిచేశారు. ఇప్పుడు సత్యనారాయణ మూర్తి కుమారుడు, రామ్మోహన్‌నాయుడు మంచి మిత్రులు. ఈ నేపథ్యంలో శ్రావ్యను రామ్మోహన్ తొలి చూపులోనే ఇష్టపడ్డాని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన శక్తిగా ఉన్న కింజారపు ఎర్రన్నాయుడి అకాల మరణం తర్వాత రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి