భూమా నాగిరెడ్డి మృతి... కుటుంబ సభ్యుడిని కోల్పోయా.. జగన్ : బాలయ్య దిగ్భ్రాంతి

ఆదివారం, 12 మార్చి 2017 (13:50 IST)
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జరుగనున్న భూమా అంత్యక్రియలకు జగన్ కుటుంబసభ్యులు హాజరుకానున్నట్టు సమాచారం. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఆయన అనుచరులు, కార్యకర్తలు, మద్దతుదారులు కన్నీరు మున్నీరవుతున్నారు.
 
అలాగే, భూమా మృతిపై సినీ నటుడు బాలకృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భూమా మృతిపై బాలయ్య స్పందిస్తూ.. ఏపీ నూతన అసెంబ్లీలో భూమా నాగిరెడ్డితో తాను మాట్లాడినప్పుడు ఆయన ఆరోగ్యంగా కనిపించారని, ఒక్కసారిగా ఇలా జరగడం చాలా దురదృష్టకరమన్నారు. నంద్యాల నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని, రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన భూమా మృతి తీరని లోటని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి