వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన కర్నూలు నేత గౌరు చరితా రెడ్డి ప్రచారం సందర్భంగా నోరు జారారు. పాణ్యంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యేగా తనను, లోక్‌సభ సభ్యుడిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల్లో టీడీపీకే ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు.