ఆయన తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భవిష్యత్ కోసం ప్రజల ఆశా, ఆకాంక్షలే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపిస్తాయన్నారు. ప్రజల సుఖసంతోషాలే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టి ఎన్నికల్లో నెగ్గుదాం అనుకుంటున్నా చంద్రబాబుని పన్నాగాన్ని ఏపీ ప్రజలు తప్పకుండా తిప్పికొడతారని జగన్ మోహన్ రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు.
అసలు హైదరాబాద్‌నూ చంద్రబాబు నిర్మించనే లేదు ఇటు అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని జగన్ విమర్శించారు. ఏ పార్టీతోనూ తమకు పొత్తుగానీ, సాన్నిహిత్యంగానీ లేదన్నారు. కానీ ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని తేల్చి చెప్పారు.
ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు, జాతీయస్థాయి రాజకీయాలపై జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు. నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నా. నేనిప్పుడు నా ప్రజలకు ఎంతమేర మంచి చేయాలన్న దాని గురించే ఆలోచిస్తున్నని ప్రస్తుతం కూడా అదే ఆలోచిస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రజలు చంద్రబాబు నమ్మేపరిస్థితే లేదని ఆయన జోస్యం చెప్పారు.