నెల్లూరు జిల్లాలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడికి జికా వైరస్ పరీక్షలు నిర్వహించగా, అతని రక్త నమూనాను నిర్ధారణ కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపారు. బాలుడిని మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు.
మాకు అనుమానిత కేసు ఉంది, కానీ అది ఇంకా నిర్ధారించబడలేదు. ప్రజలకు భరోసా ఇస్తూ, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నందున భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు. దీనిపై నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా స్పందించారు.
లక్షణాలు..
జికా వైరస్ కేసులు సాధారణంగా బ్రెజిల్, అమెరికాలో కనిపిస్తుంటాయి. జికా వైరస్ అనేది చాలావరకూ మామూలు వైరస్ అయినా కూడా.. కొంతమందిలో సీరియస్ కావచ్చు. డెంగీ, చికెన్ గున్యా తరహాలోనే జికా వైరస్ కూడా దోమల ద్వారా వస్తుంది.