ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో ఒకే వ్యక్తికి ఏకంగా 658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఏఐ టూల్ కిట్ ద్వారా టెలికమ్యూనికేషన్ శాఖ గుర్తించి, విచారణకు ఆదేశించింది. అలాగే అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మరో 150 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే,
విజయవాడ నగరంలోని గుణదలలో ఒక వ్యక్తికి 658 సిమ్ కార్డులు జారీ కావడంతో టెలికమ్యూనికేషన్ అప్రమత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకే ఫోటోతే, ఒకే నెట్‌వర్క్‌కు చెందిన ఈ సిమ్ కార్డులను విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు వీటిని రిజిస్టర్ చేసినట్టు గుర్తించారు.
అలాగే, అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మరో 150 వరకు సిమ్ కార్డులు, నకిలీ పత్రాలతో జారీ అయినట్టు గుర్తించారు. వీటిని ఏఐ టూల్‌కిట్‌ను ఉపయోగించి టెలికమ్యూనికేషన్ శాఖ గుర్తించింది. ఒకే ఫోటోతో జారీ అయిన సిమ్ కార్డులు ఎక్కడికి వెళ్లాయి. వాటిని ఎవరు, ఎందుకోసం వినియోగిస్తున్నారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.