తెలుగు రాష్ట్రాల్లో పంద్రాగస్టు వేడుకలు : జాతీయ జెండాను ఎగురవేసిన...

ఆదివారం, 15 ఆగస్టు 2021 (11:02 IST)
తెలుగు రాష్ట్రాల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనగా జరుగుతున్నాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు తమమత రాష్ట్రాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. 
 
తెలంగాణలో గోల్కొండ కోటపై జాతీయ జెండా రెపరెపలాడింది. 75వ స్వాంతంత్ర్యం దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 
 
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గోల్కోండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, కళాకారులు స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఉన్న సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు నివాళులర్పించారు.
 
ఇకపోతే, ఏపీలోని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి సీఎం జగన్‌ గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శననను సీఎం తిలకించారు.
 
అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు