గ్రామ సచివాలయం ఉద్యోగ పరీక్ష రాసి తిరగి వస్తుండగా వెంటాడిన మృత్యువు

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (15:12 IST)
గ్రామ సచివాలయ ఉద్యోగం కోసం పరీక్ష రాసి తిరిగి వస్తున్న ఆమెను మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో వచ్చి ప్రాణాలు తీసింది. మధురవాడ హైస్కూల్ ఎదురుగా జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ళ విజయమాధురి మరణించింది. 
 
గోపాలపట్టణం బాజీ జంక్షన్‌కు చెందిన దుర్గాప్రసాద్, విజయమాధురి భార్యాభర్తలు. ఆదివారం సెలవు కావడంతో భార్యను సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్లో గ్రామ సచివాలయ పరీక్షకు తీసుకెళ్ళాడు దుర్గాప్రసాద్. ఎగ్జామ్ ముగిసిన తర్వాత వీరు తిరిగి వస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్నారు. 
 
బ్రేకులు ఫెయిల్ అయిన లారీ.... వరుసగా వాహనాలను ఢీకొట్టుకుంటూ వచ్చి దుర్గా ప్రసాద్ నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి టూవీలర్ అదుపు తప్పి వెనుక కూర్చున్న దివ్యమాధురి ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కిందపడిపోయింది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు