మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు.. తదుపరి టార్గెట్ ఆమేనా?

ఠాగూర్

ఆదివారం, 23 మార్చి 2025 (09:58 IST)
స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరిచి రూ.2.20 కోట్ల నగదును వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వైకాపా మాజీమంత్రి విడదల రజనీపై ఏపీ ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ఆమె అరెస్టు నుంచి తప్పించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు. గత 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారన్న అభియోగాలను ఆమె ఎదుర్కొంటున్నారు. ఈ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. 
 
ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చిన ఏసీబీ అధికారులు.. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా, ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చిది. ఈ కేసులో మాజీ మంత్రి వాటా రూ.2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా, విడదల రజనీ మరిది గోపి, జాషువాలకు చెరో రూ.10 లక్షలు ఇచ్చినట్టు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. 
 
ఈ క్రమంలో నిందితులపై అవినీతి నిరోధక చట్టంలో ఉన్న 7, 7ఏ, ఐపీసీలో ఉన్న 384, 120బి సెక్షన్ల కింద్ కేసు నమోదు చేశారు. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ది చేకూర్చడంపై ఏసీబీ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో అరెస్టు కాకుండా ఇప్పటికే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు