తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుని అర్ధరాత్రి నుండి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జె బ్రాండ్, కల్తీసారాలపై నిరసన తెలపకుండా అడ్డుకునేందుకు వారి ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు ఆయనను హౌజ్ అరెస్టు చేశారు.
ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో అచ్చెన్నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు.
దేవినేని ఇంటి వద్ద కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఇటు విజయవాడు ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేతను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఏపీలో అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్నాయి. ఇదే విషయంపై టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో చిడతలు వాయించారు.