ఇదే అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అమరావతి ప్రాంతంలోని కరకట్టపై నిర్మించిన కట్టడాల కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. ఈ కరకట్టపై ఉన్నది కేవలం చంద్రబాబు ఇల్లే కాకుండా, నిర్మాణాలన్నింటినీ కూల్చి వేస్తామని చెప్పారు.
అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడంలో నివశిస్తూ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని పంపుతున్నారని మంత్రి బొత్స ప్రశ్నించారు. రాజధాని ప్రాతంలో ల్యాండ్ పూలింగ్ కరకట్ట వరకు వచ్చి ఎందుకు ఆగిందని అడిగారు. కరకట్టపై నిర్మాణాలు సక్రమమైతే కోర్టుకు వెళ్లవచ్చని మంత్రి బొత్స ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.