ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌లో డిజిటల్‌ ఎక్స్‌టెన్షన్‌

శుక్రవారం, 25 అక్టోబరు 2019 (17:47 IST)
ప్రస్తుతం ఉన్న ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆశించిన స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదన్న సీఎం, డిజిటల్‌ ఎక్స్‌టెన్స్‌ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓలా, ఉబర్‌ తరహాలో యాప్‌ తయారు చేయాలన్నారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎక్కడున్నాయన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలని, గ్రామ సెక్రటేరియట్‌ స్థాయిలో ఈ మ్యాపింగ్‌ జరగాలని సీఎం అన్నారు. 
 
ప్లంబర్‌ అయినా, మెకానిక్‌ అయినా, డ్రైవర్‌ అయినా ఇలా నైపుణ్యం ఉన్నవారు ఎవరైనా సరే యాప్‌లో రిజిస్టర్‌ చేయించుకోవడం ద్వారా వారి సేవలను సులభంగా పొందగలిగే అవకాశం ఉంటుందని, తగిన ఉపాధి కూడా లభిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ పద్ధతిని పాటిస్తున్నాయని, వాటి నమూనాలను పాటిస్తే సరిపోతుందన్నారు. 
 
దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని, ప్రపంచం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా అత్యుత్తమ నైపుణ్యం ఉన్న ఉన్న మానవవనరులను తయారుచేయాలని, అంతేకాకుండా పరిశ్రమలకు అవసరమైన స్థాయిలో మానవవనరులను అందించి 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చూడాల్సిన బాధ్యత ఉందని సీఎం జగన్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు