నంద్యాల జిల్లా చిన్నవంగలి గ్రామంలో ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. చిన్నవంగలి గ్రామంలో గురు శేఖర్ రెడ్డి (42), అతని భార్య దస్తగిరమ్మ, ఇద్దరు మైనర్ కుమార్తెలు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో మృతి చెందినట్లు ఆళ్లగడ్డ సబ్ డివిజనల్ పోలీసు అధికారి షేక్ షరీఫుద్దీన్ తెలిపారు.