జస్ట్ కొద్ది గంటల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడయిపోయిన శేఖర్ రెడ్డి ఇళ్లపై ఐటీ సిబ్బంది దాడులు చేస్తుంటే డబ్బేమో కట్టలు కట్టలు దొరుకుతోంది... ఇక బంగారం అయితే కిలోల లెక్కన బయటపడుతోంది. వ్యవహారం చూస్తుంటే అయ్యగారు దాచిపెట్టిన బంగారం టన్నుకు చేరుకుంటుందేమోనని అనుమానం వ్యక్తమవుతోంది. గత రెండురోజుల కిందట స్వాధీనం చేసుకున్న 100 కిలోల బంగారంతోపాటు తాజాగా ఆయన వద్ద మరో 75 కిలోల బంగారం వెలుగుచూసింది. మొత్తం 175 కిలలో బంగారాన్ని ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నారు.