రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు.. రూ.లక్ష కోట్ల పెండింగ్ బిల్లులు : సీఎం చంద్రబాబు

ఠాగూర్

బుధవారం, 18 సెప్టెంబరు 2024 (19:14 IST)
రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు, లక్ష కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెషన్షన్ సెంటరులో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందనీ, కేంద్రం నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా విజన్‌ డాక్యుమెంట్లు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు.
 
'అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో ఎక్కడా డబ్బులు లేవు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అయినా ధైర్యంతో ముందుకెళ్తున్నాం. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నాం. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు. కేంద్ర సహాయం వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తికి ఆక్సిజన్‌ లాంటిది. మూడు పార్టీల సమష్టి కృషితోనే ఇంతటి ఘన విజయం సాధించాం. నా జీవితంలో ఎన్నడూ చూడని విజయమిది. 151 సీట్లు ఉన్నాయని విర్రవీగిన వారు.. 11 సీట్లకే పరిమితమయ్యారు అదే ప్రజాస్వామ్యం' అని చంద్రబాబు అన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు