తనకున్న సుదీర్ఘ ప్రజా జీవితం ఆలంబనగా అధికారగణానికి సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని అయా విశ్వ విద్యాలయాల కులపతి హోదాలో విద్యార్ధులను సైతం ఆదిశగా కార్యోన్ముఖులను చేయాలని ఉపకులపతులను ఆదేశించారు. రాష్ట్ర రాజ్యాంగ అధినేతగా అన్ని చేస్తూనే, వ్యక్తిగతంగా కూడా తన పెద్ద మనస్సును చాటుకున్నారు.
ప్రస్తుత పరిస్ధితులలో ప్రతి ఒక్కరూ దాతృత్వం చూపాలని, దాతలు సమకూర్చే ప్రతి రూపాయి ఈ దేశంలో ఆరోగ్య పరిస్ధితులను మెరుగు పరిచేందుకు ఉపయోగపడుతుందని గవర్నర్ అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి సామాజిక దూరం పాటించటం మాత్రమే కీలకమైనందున, ప్రతి ఒక్కరూ తదనుగుణంగా వ్యవహరించాలన్నారు.