కరోనా కేసులు చూడమని బోర్డులు పెట్టడం సరికాదు... : చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:11 IST)
ప్రైవేట్  ఆసుపత్రులలో కరోనా కేసులు చూడమని బోర్డులు పెట్టడం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వైద్యులకు సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులను శిక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం కాదన్నారు. రెమిడిసివర్ ఇంజెక్షన్లు బయట మార్కెట్‌కు తరలుతున్నాయి, నిజమైన పేదలకు అవి అందాలన్న  ఉద్దేశ్యంతో, అందరికీ అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో విజిలెన్స్ తనిఖీలు చేసారే తప్ప కక్ష్యపూరితంగా కాదన్నారు. 
 
కొంతమంది ఆదాయాల కోసం ఇలా వ్యవహరిస్తున్నారన్న సమాచారం ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. పేదలకు ఆరోగ్య సహాయ సహకారాలు అందించాల్సిన సమయంలో చెడ్డపేరు మూటగట్టుకునే పరిస్థితి ఉందన్నారు. మనో ధైర్యాన్ని నింపాల్సిన వారే వెనకడుగు వేస్తున్నారన్న అపవాదు రానీయకండని ఆయన హితవు పలికారు. మీ సేవలను ప్రభుత్వం తప్పక గుర్తిస్తుందన్నారు. 
 
రాయచోటిలో ట్రూ నాట్ ల్యాబ్ నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. రాయచోటి కోవిడ్ కేర్ సెంటరులో 26 మంది రోగులు అడ్మిషన్లో ఉన్నారన్నారు. రాయచోటి కోవిడ్ ఆసుపత్రి అయిన అమరావతి ఆసుపత్రిని శానిటేషన్ పేరుతో ఒకటవ తేదీ వరకు మూసేశామని ఆసుపత్రి యాజమాన్యం చెపతున్నారనీ, యాజమాన్యం పునరాలోచించాలన్నారు. 
 
రెమిడెసివిర్ ఇంజెక్షన్లను 30 వేలు, 50 వేలు, 70 వేలుకు అమ్ముతున్నట్లు  సమాచారంతోనూ, కోవిడ్ బాధితులకు ఆరోగ్య ఇబ్బందులున్న వాళ్లకు ఖచ్చితంగా అందాలన్న ఉద్దేశ్యంతో పోలీసు అధికారుల ఆధ్వర్యంలో విజిలెన్స్ తనిఖీలు జరిగాయన్నారు. ప్రైవేట్  ఆసుపత్రులన్నీ వైద్యం చేయమని , అడ్మిట్ చేసుకోమని బోర్డులు పెట్టడం మంచి పద్ధతి కాదని రోగుల్లో ఆత్మ స్టైర్యం దెబ్బతింటుందన్నారు. ప్రాణాలను కాపాడాల్సిన వాళ్ళమే బాధ్యతా రాహిత్యంతో ఉంటే సమాజానికి తప్పుడు సంకేతం ఇచ్చిన వాళ్ళమవుతామన్నారు.
 
కొన్ని చోట్ల అధిక పీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులమేరకే ఈ చర్యలు తప్ప ఎవ్వరినీ అవమానించాలన్న ఉద్దేశ్యం కాదన్నారు. వైద్యులు కాకపోయినా, కొంతమంది సిబ్బంది బ్లాక్ మార్కెట్ కు తరలించడం , తదితర తప్పులు చేసిన వారిపైనే ఎఫ్ ఐ ఆర్ చేయడం జరిగిందన్నారు. అందరికీ ఒక భయం కలగాలన్న ఆలోచనలే తప్ప, ఏ ఒక్కరినీ కించపరిచే దురుద్దేశ్యం లేదన్నారు.
 
వైద్యులు దేవునితో సమానమనే ఈ దేశంలో విపత్కర పరిస్థితుల్లో వెనకడుగు వేయడం సమాజానికి నష్టం చేకూర్చుతుందన్నారు. మీరు చేస్తున్న సేవలు అభినందనీయమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను దృష్టిలో ఉంచుకుని  ప్రజలును మరింత సంక్షోభం లోకి నెట్టకుండా మంచి నిర్ణయం తీసుకుని వైద్య సేవలను ప్రారంభించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు