ఏపీ సచివాలయంలో కరోనా ఆంక్షలు ఎత్తివేత?

శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (17:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఏపీ ప్రభుత్వం కరోనా ఆంక్షలను సడలిస్తుంది. ఇందులోభాగంగా, ఇప్పటికే రాత్రిపూట అమలు చేస్తూవచ్చిన కర్ఫ్యూను ఎత్తివేసింది. ఇపుడు అమరావతిలోని సచివాలయంలో అమలు చేస్తూ వచ్చిన కరోనా ఆంక్షలను కూడా తొలగించింది. 
 
కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రబలంగా ఉన్న సమయంలో ఏపీ సచివాలయ సిబ్బంది కార్యాలయానికి హాజరుకావడంపై సర్కారు ఆంక్షలు విధించింది. అయితే, ఇపుడు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మునుపటితో పోల్చితే కరోనా ఉధృతి బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. 
 
సచివాలయంలో కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. అన్ని శాఖల కార్యదర్శులు కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఇకపై సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశఆరు. ఐఏఎస్ అధికారులకు కూడా బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు