పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటానికి కారణాలను ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వివరించారు. రాష్ట్రానికి టూరిస్టుగా వచ్చే పవన్ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటం ఏంటని ఆయన అన్నారు. పవన్‌కు అహంభావం అధికంగా ఉంటుందన్నారు. అందుకే ఆయన సినిమాల్లో అధిక శాతం ప్లాప్ అవుతున్నాయని జోస్యం చెప్పారు. పవన్ సినిమాల్లో విజయాలకంటే ఎక్కువ పరాజయాలే అధికంగా ఉన్నాయని మంత్రి అవంతి సెలవిచ్చాచారు.
తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా గత మూడేళ్ళ కాలంలో జనసేన కార్యకర్తలపై గూండాగిరి చేశానని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. అలా చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఒకవేళ నిరూపించలేకపోతే పవన్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని మంత్రి సవాల్ విసిరారు.