పవన్ సినిమాను జగన్ ప్రభుత్వం తొక్కేయాల్సిన అవసరం ఏముందన్నారు. పవన్ కల్యాణ్ గురించి ఇంతగా ఆవేదన చెందుతున్న చంద్రబాబు, లోకేశ్.. ఏనాడైనా జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి ఒక్క మాటైనా మాట్లాడారా.. అని పేర్ని నాని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేస్తున్నప్పుడు.. అందుకు అనుగుణంగా ధరలు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత లేదా.. అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గురించి తాము 2014లో కానీ, 2019లో కానీ తాము పట్టించుకోలేదని.. ఇకపైనా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు నాని.
ఏనాడైనా.. ప్రభాస్ సినిమా గురించో.. మహేష్ బాబు సినిమా గురించో చంద్రబాబు, లోకేశ్ ట్వీట్ చేశారా.. అని పేర్ని నాని ప్రశ్నించారు. వ్యవస్థలను దిగజార్చడంలో వారిని మించిన వారు లేరంటూ చంద్రబాబును ఉద్దేశించి కామెంట్లు చేశారు.