చంద్రబాబు - వై.ఎస్.జగన్ మధ్య రహస్య ఒప్పందమా?

మంగళవారం, 2 జనవరి 2018 (11:27 IST)
ఏపీ రాజకీయాల్లో మరో అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. వై.ఎస్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత నారాచంద్రబాబు నాయుడుల మధ్య గత కొన్నిరోజులుగా మాటల యుద్ధం తగ్గిపోయింది. ఒకవేళ ఆరోపణలు చేసుకున్నా అర్థవంతమైన ఆరోపణలు తప్ప, అనవసరమైన విమర్శలు అస్సలు చేసుకోవడం లేదు. ఇటీవల జగన్ పుట్టినరోజు వేడుక సమయంలో చంద్రబాబు నాయుడు పెట్టిన ట్వీట్‌తో జగన్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
 
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే ఇరు పార్టీల నాయకులు మాత్రం యధావిధిగా విమర్శలు చేసుకుంటున్నారు. అయితే విమర్శలు మాత్రం పెద్దగా ఘాటైన రీతిలో సాగటంలేదు. గతంలో అయితే ఇద్దరు నేతలు పరస్పరం చేసుకునే విమర్శలు తారాస్థాయిలో ఉండేవి. 
 
ప్రజల్లో చులకన అయిపోతున్నామన్న భావనతోనే ఇద్దరు నాయకులు విమర్శల్లో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా ఎన్నికల ముందు జరిగే ఎన్నికల ప్రచారం వరకు మాత్రమేనని, ప్రచారంలో మాత్రం ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విమర్శలు మానడంపై రాజకీయ విశ్లేషకులు ఇది నిజంగానే బాబు, జగన్‌ల మధ్య ఏదయినా రహస్య ఒప్పందమేమోనంటూ సెటైర్లు వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు