దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,984 మద్యం షాపుల్లో తనిఖీలు చేయించింది ప్రభుత్వం, ఈ మేరకు చాలా మద్యం దుకాణాల్లో ఇదే తరహా దందా జరుగుతోందని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందిందట. దీంతో మద్యం షాపుల్లోని సిబ్బందిని వేర్వేరు స్థానాలకు బదిలీ చేయాలనే కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
ఇలా చేయడం వల్ల అక్రమార్కులు రెచ్చిపోరని ఎక్సైజ్ శాఖ ఆలోచన. దీంతో పాటు ప్రతి మద్యం దుకాణంలో ఉన్న సిసి కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రతిపాదించారు అధికారులు. ఇదేకాదు మద్యం క్రయవిక్రయాలు, బ్యాంకు డిపాజిట్లు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై నెలకు ఒకసారి ఆడిటింగ్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారట.