ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

ఠాగూర్

బుధవారం, 26 మార్చి 2025 (14:28 IST)
ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఉచిత గ్యాస్ పథకం పొందడానికి గల అర్హతలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఎల్పీజీ కలెక్షన్ కలిగివుండటం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయిఉండాలి, ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం 1967కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. 
 
ఒక సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే, వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రతి యేడాది ఏప్రిల్ - జూలై (01), ఆగస్టు - నవంబరు (01), డిసెంబరు - మార్చి (01) మధ్య ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. 
 
ఉచిత సిలిండర్ కావాల్సినవారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ సిలిండర్ ఇస్తారు. ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయితే 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేయడం జరుగుతుంది. 
 
గత యేడాది నవంబరు 1వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు దీపం -2 పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. దీపం-2 పథకంతో ప్రతి పేద వాడి ఇంట్లో దీపపు కాంతులు విరాజిల్లుతున్నాయన్నారు. కుటుంబాల జీవనం ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'దీపం-2' పథకం రూపొందించాయమని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా 'దీపం-2' పథకానికి రూ.2684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు