ఏపీలో హాట్ టాపిక్‌గా మంత్రివర్గ మార్పు

బుధవారం, 6 ఏప్రియల్ 2022 (15:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గం మార్పుపై రసవత్తరంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 11వ తేదీన తర్వాత రాష్ట్రానికి కొత్త మంత్రులు రాబోతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా స్పష్టం చేశారు. దీంతో కొత్త మంత్రులు ఎవరన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 
 
ఈ పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఏపీ మంత్రివర్గ విస్తరణ సీఎం అభీష్టం మేరకే జరుగుతుందన్నారు. కొత్త మంత్రులు ఎవరన్న అంశంపై తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారని చెప్పారు. 
 
మరోవైపు, వైకాపా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మంత్రివర్గ విస్తరణ స్వాగతిస్తున్నాం. నేను మంత్రిపదవి రేసులో లేను. దయజేసి నా పేరును మంత్రిపదవి రేసులో ఉన్నాననే ప్రచారం చేయద్దు. జిల్లాలో బీసీ వ్యక్తికి కాకుండా అగ్రకులంలో ఉన్న నాకు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. బొత్స సత్యనారాయణను మంత్రిగా కొనసాగించాలని కోరుతున్నాం. నేను నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నాను. జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతాను అని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు