60 అసెంబ్లీ సీట్లు వచ్చినపుడు సభకు వెళ్లలేదు. ఇపుడు ప్రజలు ఇవ్వకపోతే, ప్రతిపక్ష అర్హత కావాలని అడుగుతున్నారన్నారు. జగన్ వైఖరి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. త్వరలోనే ఒక రూట్ మ్యాప్ ఉంటుందని, అది బహిర్గతంగా కనిపించదన్నారు. ఇపుడు రాష్ట్రంలో విస్తృతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.
అసెంబ్లీకి వెళ్లను అనే వ్యక్తా ఆంధ్రా ప్రజలకు కావాల్సింది అని ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి ప్రధాన కారణం కార్మిక సంఘాల నాయకులేనని ఆరోపించారు. ఎక్కడ నుంచి వచ్చారు... ఎంత ఆస్తులు సంపాదించారు.. ఉద్యమాలు చేస్తూ రెచ్చగొట్టి పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రధాని నరేంద్ర మోడీకి బాగా తెలుసన్నారు. వికసిత భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంతో కూటమి ముందుకు వెళుతుందన్నారు.