అయితే, మార్చి ఒకటో తేదీన బోరుగడ్డ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు వేస్తూ మధ్యంతర బెయిల్‌ను పొడగించాలని కోరాడు. తన తల్లికి తాను ఒక్కడినే కుమారుడినని, ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, రెండు వారాల పాటు చికిత్స అవసరమని కాబట్టి మధ్యంతర బెయిల్‌ను పొడగించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వాదనకు బలం చేకూరేలా గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ ఇచ్చినట్టుగా ఓ మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాడు.