తిరుమల కలియుగ దైవ దర్శనం కోసం మెట్లెక్కుతూ బిటెక్ విద్యార్థి హఠన్మరణం
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (19:31 IST)
గోవింద నామ స్మరణలు చేస్తూ తిరుమల శ్రీవారి అలిపిరి మెట్లు ఎక్కుతూ వెళుతుంటారు భక్తులు. ఐతే శనివారం నాడు విషాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడకమార్గంలో తిరుమలకు వెళుతున్న యువ భక్తుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
ఈ విషాదం శనివారం నాడు జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన బిటెక్ విద్యార్థి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి కాలి నడకన బయలుదేరారు. ఐతే గాలి గోపురం సమీపంలోకి రాగానే యువకుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు.
ఆయాసంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురవడంతో స్పృహ కోల్పోయి పడిపోయాడు. టిటిడి సిబ్బంది అతడికి ప్రథమ చికిత్స అందించినా అతడు కోలుకోలేదు. ఊపిరి అందక మృతి చెందాడు.