ఆయన మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా కొలిచే శ్రీరాముని సిరస్సు ఖండించి హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపరిచారని,ఇంతవరకు ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని అరెస్టు చెయ్యక పోవటం వెనుక ఏ ఉద్దేశం ఉందని ప్రశ్నించారు.
అయితే రాష్ట్రప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరినట్లు ప్రకటించిందని,ఆప్రకారమే తాను వివరణ కోరగా ఈ విషయం తెలిపారని ఆయన చెప్పారు. హిందు దేవాలయాలను ఇండోమెంట్ శాఖల నుండి వేరుచెయ్యలని ఇప్పటికే సుప్రీం కోర్ట్ ఆదేశించినా అమలు జరగటంలేదని, తాము అన్ని రాష్ట్రాల్లోని ఆలయాలను పర్యవేక్షించేందుకు గాను సెంట్రల్ బోర్డు ఆ టెంపుల్ అథారిటీ ని ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరుతున్నామని శాస్త్రీ చెప్పారు.