కందుకూరు - గుంటూరు తొక్కిసలాటలు వైకాపా కుట్ర : చంద్రబాబు ఆరోపణ

ఆదివారం, 8 జనవరి 2023 (16:10 IST)
కందుకూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలు యాదృచ్ఛికంగా జరిగినవి కావని, వైకాపా కుట్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో చంద్రబాబును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. వీరిద్దరు దాదాపు 2 గంటల పాటు సుధీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 
 
వైకాపా ప్రభుత్వం చీకట్లో తీసుకొచ్చిన జీవో నంబర్ 1 ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో జరగరానిది జరుగుతోంది. విశాఖలో ఆంక్షలు పెట్టి పవన్‌‍ను హింసించారు. ఇప్పటంలో పవన్ సభకు స్థలం ఇస్తే ప్రజల ఇళ్లను కూల్చివేశారు. విశాఖలో నన్ను కూడా అడ్డుకున్నారు. జీవో నంబర్ 1 పరిణామాలను ముందుగానే విశాఖలో చూశాం. వైకాపా ప్రబుత్వం అరాచకాలు పరాకాష్టకు చేరాయి. 
 
కుప్పం వెళ్తానంటే అడ్డుంకులు సృష్టించారు. వైకాపా కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు ఘటనలు అని ఆరోపించారు. కందుకూరు ఘటన పోలీసుల కుట్ర కాదని చెప్పే ఈ పోలీసులకు ఉందా? కుట్ర కుతంత్రాలకు సాగే రాజకీయాలను తిప్పికొడతాం. ఏపీ అభివృద్ధిని తిరిగి గాడిలో పెడతాం. ఏపీలో వ్యవస్థలను నాశనం చేశారు. చేస్తున్నారు కూడా. రాష్ట్రంలో ప్రజాజీవితం అంధకారమైంది. ఇప్పటికే ప్రజాస్వామ్యయ పరిరక్షణకు వేదిక ఏర్పాటైంది. ఇక అన్ని రకాల పోరాటాలు చేస్తాం అని చంద్రబాబు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు