తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు కూడా రెడీగా ఉన్నామని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా కాపాడేందుకు తాము రాజీనామాలు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనకు చంద్రబాబు మద్దతు పలికారు.
వైకాపాకు 22 మంది ఎంపీలు ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం మీరు ఏం చెప్పినా చేయడానికి మేం రెడీ. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాజీనామాలకూ మేం సిద్ధం. అని చంద్రబాబునాయుడు ప్రకటించారు. విశాఖ ఉక్కు కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, తెన్నేటి విశ్వనాథం ఎంతో కృషి చేశారన్నారు.