రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్న సీఎం జగన్

సెల్వి

గురువారం, 13 జూన్ 2024 (15:18 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో డీలా పడ్డ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మళ్లీ జనంలోకి వెళ్లాలని జగన్‌ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పోలింగ్, కౌంటింగ్ తర్వాత జరిగిన దాడుల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శిస్తారని సమాచారం. 
 
గురువారం వైఎస్‌ జగన్‌‌ వైసీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. శాసనమండలిలోనైనా గట్టిగా ప్రభావం చూపాలని వైసీపీ ఎమ్మెల్సీలకు ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని.. కేసులు పెట్టినా భయపడొద్దు.. అంటూ జగన్ సూచించారు. 
 
రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన హనీమూన్‌ నడుస్తోందని.. వారికి మరికొంత సమయం ఇచ్చి..తర్వాత పోరాడుదాం.. అంటూ ఎమ్మెల్సీలకు వివరించారు. అసెంబ్లీలో తమ నోరును కట్టడి చేసే అవకాశం ఉందని.. మండలిలో గట్టిగా పోరాడుదాం అంటూ జగన్‌ సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు