గత జూలై 14న లక్ష్మీ శ్రావణి (33) ప్రసవ వేదనతో స్థానిక సులోచనమ్మ నర్సింగ్ హోమ్‌కు వచ్చింది. డాక్టర్ సులోచన ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసింది. అయితే శస్త్రచికిత్స సమయంలో కడుపులో దూదిపెట్టి కుట్లు వేశారు. దీంతో దీర్ఘకాలంలో శ్రావణికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో గత నెల 25న ఆమెను నెల్లూరులోని సింహపురి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.