తిరుమలలో ఈ నెల 14న బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు తమిళనాడులోని నామకల్‌లో పోలీసుల ఎదుట బాలుడితో సహా లొంగిపోయారు. తమకు పిల్లలు లేకపోవడంతో ఈ పని చేశామని వారు పోలీసులకు తెలియజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన దంపతులు, ఆ తర్వాత బాలుడిని ఎత్తుకుని వెళ్లినట్టు సీసీ టీవీ పుటేజ్‌లో స్పష్టం కావడంతో వారి ఫోటోలు అంతటా డిస్ట్రిబ్యూట్ చేశారు. దీనితో నిందితులు భయపడిపోయి పిల్లవాడిని తీసుకుని పోలీసుల ముందు లొంగిపోయారు. వీడియో చూడండి.