దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు సుబ్బయ్యను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సుబ్బయ్య ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం పారితోషికం ప్రకటించడం, సుబ్బయ్య ఫోటోలతో పోస్టర్లు విడుదల చేయడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. అయితే సుబ్బయ్య తన బంధువులకు ఫోన్ చేసి.. తాను చనిపోతున్నట్టుగా చెప్పినట్టు సమాచారం.