హైదరాబాద్‌లో డాన్స్ అకాడెమీని నిర్వహిస్తూ జీవనం సాగిస్తూ వచ్చిన ఓ మహిళా డైరెక్టర్‌కు అదే సంస్థలో పని చేసే పీఆర్వో ఒకరు లైంగికంగా వేధించాడు. తీసుకున్న అప్పు చెల్లించలేకుంటే ఒక్కసారి నా కోర్కె తీరిస్తే సరిపోతుందంటూ టార్చర్ చేశారు. ఈ వేధింపులు భరించలేని ఆ మహిళ హైదరాబాద్ నగర పోలీసులను ఆశ్రయించడంతో ఆ పీఆర్వో బండారం బయటపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
హైదరాబాద్, వనస్థలిపురానికి చెందిన 32 యేళ్ళ మహిళ ఒకరు స్థానికంగా ఓ డాన్స్ అకాడమీ నిర్వహిస్తున్నారు. అదే అకాడమీలో పీఆర్‌వోగా ఇసాక్ రూబెన్(28) వద్ద రూ.27 వేలు అప్పు తీసుకున్నారు. ఈ అప్పు చెల్లించడంలో జాప్యమైంది. దీంతో అప్పు చెల్లించలేని పక్షంలో తనకు పడకసుఖం ఇవ్వాలంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఆ తర్వాత మరో వ్యక్తివద్ద అప్పు తెచ్చి చెల్లించింది. అయినప్పటికీ రూబెన్ తీరుమారలేదు. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి నెట్‌లో పెడతానని, అత్తమామలకు చెడుగా చెబుతానని బెదిరించాడు. అతడి వేధింపులు భరించలేక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.