రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులతో పాటు టాటా బిర్లాలకే ఇబ్బందులు తప్పలేదు. టాటా, బిర్లా, మహేంద్ర గ్రూపులకు చెందిన మార్కెట్ విలువ కుప్పకూలింది. దాదాపు 9 బిలియన్ డాలర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది.
రిజర్వ్ బ్యాంకు ఎదురుగా ఉన్న ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలో వీటిని ఉంచారు. ఈ విషయం తెలిసిన జనం అర్థరాత్రే ఏటీఎం ఎదుట బారులు తీరారు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.400 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లను రిజర్వ్ బ్యాంకు పంపించింది. పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్త రూ.2000 నోట్లను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది.