భర్త హరిబాబు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని వేధిస్తుండటంతో తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను భర్తతో కలిసి ఉండనని, తల్లిదండ్రుల వద్దకు వెళతానని పోలీసులకు చెప్పింది. అయితే తమను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న అనూషను తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు.
ఓ వైపు తన 8 ఏళ్ల కుమారుడిని భర్త తనకు దూరం చేసి తనవద్దే ఉంచుకోవడం, మరోవైపు తల్లిదండ్రుల నిరాకరణ కలగలిసి తీవ్ర మనోవేదనకు గురయిన అనూష ఆత్మహత్యే శరణ్యమని భావించి సిద్దవటం వద్ద ఉన్న పెన్నా నదిలో దూకేందుకు ప్రయత్నించింది.
పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం యువతిని వన్ స్టాప్ సెంటర్‌కు తరలించారు. తనకు మనోధైర్యాన్నిచ్చి భరోసా కల్పించి అండగా నిలిచిన 'దిశ' పోలీస్ స్టేషన్‌కు, జిల్లా ఎస్.పి అన్బురాజన్‌కి యువతి కృతజ్ఞతలు తెలియచేసింది.