ఏపీ సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు... ఎందుకంటే?

శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (19:58 IST)
corona test to jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. ముఖ్యంగా, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం అధునాతన కిట్స్‌ను కూడా ఉపయోగిస్తోంది. తాజాగా సౌత్ కొరియా నుంచి లక్ష కిట్స్‌ను దిగుమతి కూడా చేయించుకుంది. 
 
ఈ కిట్లను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఆదే కిట్లను ఉపయోగించి ముఖ్యమంత్రి జగన్‌కు వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో నెగెటివ్ అని వచ్చింది. 
 
ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ కిట్లను జిల్లాలకు పంపి సామూహిక పరీక్షలు చేపట్టాలన్నది ప్రభుత్వ యోచన. తద్వారా కరోనా వ్యాప్తిని త్వరితగతంగా అరికట్టవచ్చని ఏపీ సర్కారు భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు