బాలిక కడుపులో వెంట్రుకల ఉండ

ఆదివారం, 10 మార్చి 2019 (12:58 IST)
తెలంగాణ రాష్ట్రం, మెదక్ పట్టణానికి చెందిన ఓ బాలిక కడుపులో నుంచి వెంట్రుకల ఉండను వైద్యులు వెలికితీశారు. దీంతో ఆ బాలికకు ప్రాణాపాయం తప్పింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన 15 యేళ్ల బాలిక గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. 
 
అయితే, నానాటికీ కడుపునొప్పి ఎక్కువకావడంతో మెదక్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేసి బాలిక కడుపులో నుంచి వెంట్రుకల ఉండను బయటికి తీశారు. 
 
బాలిక మానసిక ఒత్తిడికి గురై వెంట్రుకలను తినగా అవి కడుపులో ఉండలా తయారయ్యాయని వైద్యుడు చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని, ఇలాంటి కేసు జిల్లాలో రావడం ఇదే మొదటిసారని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు