తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాజీపేట జంక్షన్ రైల్వే కమర్షియల్ విభాగంలో టీటీఐగా నీలిమ అనే మహిళ పని చేస్తోంది. ఈమె సికింద్రాబాద్ నుంచి ధానాపూర్ వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకుంది. స్లీపర్ క్లాస్ ఒకటో నంబరు బోగీలో వెళ్లి ప్రయాణికుల వద్ద టిక్కెట్లను తనిఖీ చేపట్టారు. అపుడు కొందరు ప్రయాణికులు జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్‌క్లాస్ కోచ్‌లోకి రావడంతో గుర్తించి, వారందరినీ అపరాధం చెల్లించాలని కోరింది.
అయితే, బోగీ ప్రయాణికులతో రద్దీగా ఉండటంతో ఏ ఒక్క ప్రయాణికుడు ఆమె మాటను పట్టించుకోలేదు. పైగా, ఆమెను కిందికి తోసేశారు. దీంతో ఆమె ప్లాట్‌ఫాంపై పడింది. ఆమె కాలు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లడంతో జనరల్ బోగీ ప్రయాణికులు గమనించి బయటికిలాగేశారు.