గంజాయి రవాణాపై తూర్పు గోదావరి పోలీస్ ఉక్కుపాదం

బుధవారం, 7 జులై 2021 (09:45 IST)
తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి, చింతూరు సర్కిల్ పోలీసులు గంజాయి రవాణా పై ఉక్కుపాదం మోపుతున్నారు.

ఈ నేపద్యంలో చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం నాడు పెద్ద లారీలో బొగ్గు మాటున తరలిస్తున్న 29 సంచుల్లో 870 కేజీల గంజాయిని చింతూరు సీఐ యువకుమార్ ఎస్సై యాదగిరిలు చాకచక్యంగా పట్టుకున్నారు.

విశాఖపట్నంలో బొగ్గు లోడు చేసుకొని అక్కడ నుండి మారేడుమిల్లి ఘాట్లో గంజాయి లోడు చేసుకొని అక్కడ చింతూరు మీదుగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా *తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చింతూరు సర్కిల్ పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసుకొని గంజాయి రవాణాకు పాల్పడుతున్న లారీని పోలీసులు పట్టుకొని ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి స్మగ్లింగ్ కి స్మగ్లర్లు తెలివిగా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఒక పెద్ద కంటైనర్ నెం. యూపీ11టీ 7815లో బొగ్గు లోడు చేసుకొని దాని మధ్యలో గంజాయి సంచులు వేసి తరలించే ప్రయత్నానికి చింతూరు పోలీసులు చెక్ పెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు