తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23వ తేది నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది. 30వ తేది నామినేషన్ల్ల దాఖలుకు చివరి తేది. 31న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.
తెలంగాణలో నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికకకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక్కడ టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సాగర్‌లో కైడా ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న కౌంటింగ్ జరగనుంది. షెడ్యూల్ విడుదల కావడంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.