ఈ పాలనలో వున్నందుకు బాధపడుతున్నానంటూ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఆ వీడియో ఎప్పటిది?

శుక్రవారం, 15 డిశెంబరు 2023 (13:00 IST)
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో గిరిజలను పడుతున్న కష్టాల గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజన బాలికలకు జరుగుతున్న వైద్యం చూసి తను చాలా బాధ పడుతున్నట్లు వెల్లడించారు.
 
ఇలాంటి పాలనలో ఎమ్మెల్యేగా వున్నందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలో గిరిజనలు బాధలు చెప్పుకునేందుకు ఇక్కడ ఎవరూ లేరనీ, పట్టించుకునే మంత్రి లేరని అంటూ చెప్పారు. ఐతే ఈ వీడియో ఆమె తాజాగా మాట్లాడిందా లేదంటే గతంలో తెదేపా హయాంలో మాట్లాడినదా అనే అనుమానం కలుగుతోంది. మరి నిజం ఏంటో తెలియాల్సి వుంది.

ఈవిడ ఎవరో తెలుసు కదా !?
కురుపాం శాసనసభ్యురాలు !
మాజీ ఉప ముఖ్యమంత్రి !!

విజయనగరం జిల్లాలో గిరిజనులకి వైద్య సేవలు అందడం లేదు, బైక్ అంబులెన్సులు పని చెయ్యట్లేదు, సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో బాలికలు, గర్భిణీ మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.… pic.twitter.com/m8sl3wpifv

— Swathi Reddy (@Swathireddytdp) December 15, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు