Vasireddy Padma త్వరలోనే ఆ పార్టీలో చేరుతున్నా : వాసిరెడ్డి పద్మ (Video)

ఠాగూర్

శనివారం, 7 డిశెంబరు 2024 (15:28 IST)
Vasireddy Padma is all set to join TDP గత వైకాపా ప్రభుత్వంలో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ టీడీపీ, జనసేన పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోవడం, రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వైకాపా నేతలంతా ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారిలో వాసిరెడ్డి పద్మ ఒకరు. ఈమె తన మహిళా చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైకాపా నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతుంది. దీనిపై ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నట్టు చెప్పారు. విజయవాడలో ఎంపీ కేశినేని చిన్నితో సమావేశమైనట్టు చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోస్టుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయించారనీ, వైసీపీ అధ్యక్షుడు ఎవరో మీరు నిర్ణయించుకోండి అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 
 
గత ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు తిరస్కరించారని, అందుకే 11 సీట్లకు పరిమితం చేశారని చెప్పారు. భవిష్యత్‌లో కూడా తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో అవికూడా ఉండవన్నారు. వైసీపీ పార్టీని పెట్టిన దగ్గర నుంచి తాను ప్రతిదీ చూస్తూనే ఉన్నాననీ, ప్రతి స్కామ్‌కి వైఎస్ జగనే కారణమని ఆమె ఆరోపించారు. 

 

త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నాను: వాసిరెడ్డి పద్మ

విజయవాడలో ఎంపీ కేశినేని చిన్నితో మాజీ మహిళా కమిషనర్ భేటి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోస్టుపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం

ఏపీకి సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయించారు. వైసీపీ అధ్యక్షుడు ఎవరో మీరు నిర్ణయించుకోండి అంటూ కౌంటర్

జగన్ ను… pic.twitter.com/Gfmmx5TTvg

— BIG TV Breaking News (@bigtvtelugu) December 7, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు