మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ కోసం ఆళ్లగడ్డ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత రెండ్రోజులుగా పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుని తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఓ పోలీసుపై కారును పోనిచ్చాడన్న కేసులు కూడా భార్గవరామపై నమోదయ్యాయి. ప్రస్తుతం ఆళ్లగడ్డ పీఎస్‌లో రెండు కేసులు, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు నమోదు అయ్యాయి.
రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లో భార్గవరామను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కారును ఆపినట్లే ఆపి.. ఆ తర్వాత వేగంగా కారును డ్రైవ్ చేసుకుని వెళ్లాడని ఆళ్లగడ్డ ఎస్‌ఐ చెప్తున్నారు. అంతేకాదు కారును తమపైకే పోనిచ్చాడని ఎస్ సోమేష్‌కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్ అఖిలప్రియ భర్త కోసం గాలింపును ముమ్మరం చేసింది.