జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో అసత్యాలు, అబద్ధాలతో పరిపాలిస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డి తప్పుడు లెక్కలతో చార్టెడ్ అకౌంటెడ్ గా వచ్చి కంపెనీల లావాదేవీలను మరుగున పడేసి కొత్త అవతారం ఎత్తారన్నారు. ఊసరివెళ్లి లాగా అన్ని అవతారాలను విజయసాయిరెడ్డి ఎత్తుతున్నారని, కరోనాకు డిసెంబరు 25న మందు ఇస్తామని ఎవరి అనుమతితో ట్వటిర్లో పెట్టి తర్వాత తీసేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
108 వాహనాలు మీ అల్లుడు కంపెనీ ద్వారా కొనుగోలు చేసారు. వ్యాక్సిన్ కూడా బ్రోకరైజ్ చేసి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు. విజయసాయిరెడ్డి ఊసరవెల్లి రాజకీయాలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. వ్యాపారం రాజకీయం రెండు ఒక చోట ఉండవనే విషయం గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్ అంశాన్ని ట్విట్టర్ నుండి ఎందుకు తీశారో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.