ఎమ్మెల్యే పదవికి మేకతోటి సుచరిత రాజీనామా!?

సోమవారం, 11 ఏప్రియల్ 2022 (08:46 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సొంత పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీశాయి. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మంత్రివర్గంలో చోటు కోల్పోవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సుచరిత కుమార్తె ప్రకటించింది. 
 
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన మేకతోటి సుచరిత తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్‌లో రాసి రాజీనామా లేఖను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు అందజేశారు. తనను బుజ్జగించేందుకు వచ్చిన మోపిదేవికి ఈ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 
 
ఈ సందర్భంగా మేకతోటి సుచరిత అనుచరులు వెంకటరమణ వాహనాన్ని అడ్డుకుని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుచరిత కుమార్తె మీడియాతో మాట్లాడుతూ.. సుచరిత తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో వెంకటరమణకు అందజేసి, తాము వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు