రేణిగుంట గరుడ నిలయం సుందరీకరణ భేష్.. విమానాశ్రయాన్ని గరుత్మంతుని ఆకారంలో..

ఆదివారం, 1 జనవరి 2017 (10:06 IST)
రేణిగుంట గరుడ నిలయం... సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంది. తిరుపతి దివ్యక్షేత్రానికి వచ్చే యాత్రికులు ఆధ్యాత్మిక వాతావరణంలో తన్మయత్వం పొందేలా ముస్తాబైంది. ఇటీవల రూ.8.36 కోట్ల వ్యయంతో చేపట్టిన సుందరీకరణ పనులు పూర్తయి.. కొత్త సొబగులు అద్దుకున్న తిరుపతి విమానాశ్రయం ఇస్కా సదస్సుకు వస్తున్న అతిథులకు హరిత హారతి పడుతోంది. తిరుపతి క్షేత్ర ప్రాధాన్యత నేపథ్యంలో.. విమానాశ్రయాన్ని గరుత్మంతుని ఆకారంలో విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. దీన్ని 2015లో ప్రధాని మోడీ ప్రారంభించారు. 
 
అనంతరం ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ దాదాపుగా పూర్తికావచ్చాయి. త్వరలోనే ఇక్కడ ఇమ్మిగ్రేషన్‌ విధానం మొదలు కానుంది. తాజాగా ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో సుందరీకరణ పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. దూరం నుంచి చూడగానే విమానాశ్రయ ముఖద్వారం గరుత్మంతుడు రెక్కలు చాచి ఉన్నట్లు కనిపిస్తుంది. 
 
శ్రీకాళహస్తి ప్రధాన రహదారి నుంచి విమానాశ్రయం చుట్టూరా పాతిక ఎకరాల స్థలంలో చేపట్టిన హరిత వనం ఆహ్లాదాన్ని పంచుతుంది. విమానాశ్రయం సుందరీకరణ బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చేపట్టింది.

వెబ్దునియా పై చదవండి