తాజాగా, తన అర్ధాంగి అంజనాతో కలిసి తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదానం చేశారు. ఓవైపు కరోనా సంక్షోభం తీవ్రతరమై సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమైన పరిస్థితుల్లో నాని దంపతులు ముందుకువచ్చి తలసేమియా చిన్నారుల కోసం రక్తం ఇవ్వడం ప్రశంసనీయం.
ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన ఓ శిబిరానికి హాజరైన నాని, అంజన రక్తదానం చేశారు. దీనిపై ఎన్టీఆర్ ట్రస్ట్ నాని దంపతులకు కృతజ్ఞతలు తెలిపింది. లాక్ డౌన్ సమయంలోనూ రక్తం ఇవ్వడం ద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడారని కొనియాడింది.